Bandi Sanjay: కేసీఆర్ సహా కుటుంబ సభ్యుల పాస్ పోర్ట్ సీజ్ చేయాలి: బండి సంజయ్

Bandi Sanjay asks government to seize KCR passport
  • అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు దోచుకు తిన్నారని ఆరోపణ
  • అవినీతిని బయటపెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలన్న బండి సంజయ్
  • అంతకంటే ముందే వారి పాస్ పోర్టులను సీజ్ చేయాలని సూచన
బీఆర్ఎస్ జాతీయ ప్రెసిడెంట్ కేసీఆర్, ఆయన కుటుంబం సహా ఆ పార్టీ నాయకుల పాస్‌పోర్టులను జప్తు చేయాలని.. లేదంటే వారు దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. 

శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారని మండిపడ్డారు. వాళ్ల అవినీతిని త్వరగా బయటపెట్టి... వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతకంటే ముందే వాళ్ల పాస్ పోర్టులను రేవంత్ ప్రభుత్వం సీజ్ చేయాలని సూచించారు. లేదంటే విదేశాలకు పారిపోయే అకాశముందని హెచ్చరించారు. అలాగే ఈ అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎంగా ఉండగా సీఎంఓలో పదవీ విరమణ చేసిన అధికారులు కూడా అడ్డగోలుగా ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్ల పాస్ పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవాలని, కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదటపడే వరకు వేచి చూడాలన్నారు.
Bandi Sanjay
Telangana
BRS
KCR

More Telugu News