Meteor Shower: నేటి నుంచి ఐదు రోజులపాటు ఆకాశంలో అద్భుతం.. ఇప్పుడు చూడడం మిస్సయితే బాధపడతారు?

Geminid meteor shower of 2023 continues tonight

  • మిరుమిట్లు గొలిపే కాంతితో జారిపడనున్న ఉల్కలు
  • ఈ నెల 20 వరకు నేరుగా వీక్షించొచ్చు
  • రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు ఉల్కాపాతం

నేటి నుంచి ఈ నెల 20 వరకు ఐదు రోజులపాటు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఎలాంటి పరికరాలు లేకుండా అందరూ నేరుగా వీక్షించొచ్చు. నేటి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వేర్వేరు సమయాల్లో మిరుమిట్లు గొలిపే కాంతితో ఉల్కలు జారిపడనున్నాయి. పాథియాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొన్ని నెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఇది ఇంకొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్నచిన్న ఉల్కలుగా రాలిపడనుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శ్రీరఘునందన్ కుమార్ తెలిపారు. 

ఉల్కలుగా రాలిపడే క్రమంలో గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ (ఐఎంవో) తెలిపింది. ఈ ఉల్కాపాతాన్ని గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ నేరుగా చూడొచ్చని, ఉల్కాపాతాన్ని వీక్షించేవారు ఫొటోలు, వీడియోలు తీసి ఐఎంవో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కూడా చేయవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News