Pooja Hegde: బెదిరింపులపై స్పష్టతనిచ్చిన పూజా హెగ్డే టీమ్

Pooja Hegde team clarifies on threat rumors

  • అందాల నటి పూజా హెగ్డేపై పుకార్లు
  • దుబాయ్ లో పూజా హెగ్డే గొడవపడిందంటూ వార్త
  • కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామని బెదిరించినట్టు ప్రచారం  
  • ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని పూజా హెగ్డే ప్రతినిధుల స్పష్టీకరణ

ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల దుబాయ్ వెళితే, అక్కడ వివాదం చోటుచేసుకుందని, కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వచ్చింది. దీనిపై పూజా హెగ్డే ప్రతినిధులు స్పందించారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఆధారాలు లేకుండా ఎలా రాస్తారని పూజా హెగ్డే టీమ్ ప్రశ్నించింది. ప్రజలు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. పూజా హెగ్డే టీమ్ ప్రకటన చేసిన నేపథ్యంలో, సదరు బాలీవుడ్ మీడియా సంస్థ ఆ వార్తను తొలగించింది.

More Telugu News