Vizag Fire Accident: విశాఖపట్నంలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

Fire Accident In Vizag Indus Hospital

  • జగదాంబ జంక్షన్ లో భారీ ప్రమాదం
  • చుట్టుపక్కల భారీగా వ్యాపించిన పొగ
  • నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆసుపత్రి రెండో అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ మార్గం గుండా పలువురు రోగులను బయటకు తీసుకొచ్చారు.

వారిని సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి భారీగా వెలువడుతున్న పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని షాపులను అధికారులు మూసేశారు.

Vizag Fire Accident
Indus Hospital
Andhra Pradesh
Vizag
patients
fire engines
Fire tenders
  • Loading...

More Telugu News