Droupadi Murmu: శీతాకాల విడిది కోసం 18న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu on her annual sojourn to Hyderabad from 18
  • ఐదు రోజుల పాటు బస... 23న తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్న రాష్ట్రపతి
  • ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతికుమారి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తారు. 23వ తేదీన ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి రాకలోపు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఐదు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడ బస చేస్తారని తెలిపారు. 
Droupadi Murmu
shanti kumari
Telangana
Hyderabad

More Telugu News