Nagarjuna: కేసీఆర్‌ను పరామర్శించిన సినీ నటుడు నాగార్జున

Nagarjuna Meets CM KCR in Yashodha Hospital

  • కేసీఆర్‌కు యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స
  • ఆపరేషన్‌ అనంతరం కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేతకు నటుడు నాగార్జున పరామర్శ
  • కేసీఆర్‌ను కలవడంపై హర్షం వ్యక్తం చేసిన నాగార్జున

తుంటి మార్పిడి చికిత్స అనంతరం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కేసీఆర్‌ను పరామర్శించారు. తాజాగా సినీ నటుడు నాగార్జున కూడా యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌‌ను కలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను కలుసుకోవడంపై నాగార్జున స్పందిస్తూ, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని తెలిపారు.

Nagarjuna
KCR
BRS
  • Loading...

More Telugu News