Mega Star: బన్నీ తరువాత కథ చెప్పింది మెగాస్టార్ కే!: వక్కంతం వంశీ

Vakkantham Vamsi Interview

  • నితిన్ తో సినిమా చేసిన వక్కంతం వంశీ 
  • నానీతోను చేయాలనుందని వ్యాఖ్య
  • ఆయన సినిమాలను చూస్తుంటానని వెల్లడి 
  • చిరంజీవిని ఒప్పిస్తానని చెప్పిన వంశీ 

వక్కంతం వంశీ సినీ కథా రచయితగా సక్సెస్ అయ్యాడు. ఆయన కథలను అందించిన అనేక సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. కథా రచయితగా ఎన్టీఆర్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. రవితేజ వంటి హీరోలకు ఆయన బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్ఛాడు. అలాంటి ఆయన దర్శకతంలో రూపొందిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' సినిమా రీసెంటుగా థియేటర్లకు వచ్చింది. 

తాజా ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను అభిమానులతో వక్కంతం వంశీ పంచుకున్నాడు. 'నా పేరు సూర్య' తరువాత నేను చిరంజీవిగారిని కలిసి కథ చెప్పాను. కానీ అది వర్కౌట్ కాలేదు.  ఆ తరువాత కూడా ఆయనను రెండుమూడు సార్లు కలిశాను. త్వరలోనే ఆయనకి ఒక కథ చెప్పి ఒప్పించగలననే నమ్మకం ఉంది" అన్నాడు. 

చిరంజీవి గారు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు. ఆయనలో అప్పట్లో ఎంతటి ఎనర్జీ ఉండేదో .. ఇప్పటికీ ఆ ఎనర్జీ అలాగే ఉండటం నేను గమనించాను. ఆయన ఎప్పుడు రంగంలోకి దూకేయమంటే అప్పుడే దూకేస్తాను. ఇక నాని నటన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటాను. ఆయనతోను ఒక సినిమా చేయాలనుంది" అని చెప్పాడు.

Mega Star
Vakkantham Vamsi
Nani
  • Loading...

More Telugu News