One By Two: నిరోషాను నా జోడీగా పెట్టమని బ్రతిమలాడినా ఆ డైరెక్టర్ వినిపించుకోలేదు: జేడీ చక్రవర్తి

JD Chakravarthi Interview

  • 1993లో వచ్చిన 'వన్ బై టూ'
  • సినిమా విడుదలై 30 ఏళ్ల పూర్తి   
  • హీరోయిన్ నిరోషా గురించిన ప్రస్తావన  
  • తన పాత్ర పేరు వెనుక కథ చెప్పిన జేడీ


జేడీ చక్రవర్తి తొలినాళ్లలో వచ్చిన సినిమాలలో 'వన్ బై టూ' ఒకటి. 1993 .. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు దాటిపోయింది. సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. " ఈ సినిమా విడుదలైపోయి అప్పుడే 30 ఏళ్లు అయిందా అనిపిస్తోంది. ఆ సినిమా అప్పటి సంగతులు నాకు బాగా గుర్తున్నాయి" అన్నారు. 

'ఘర్షణ' సినిమా హైలైట్స్ లో నిరోషాను కూడా కలుపుకుని చెప్పాలి. ఆ సినిమా తరువాత నేను ఆమెకి అభిమానిగా మారిపోయాను. అలాంటి ఆమె 'వన్ బై టూ' సినిమాలో చేస్తుందనగానే ఆశ్చర్యపోయాను. ఆమెను నాకు జోడీగా సెట్ చేయమని దర్శకుడు శివనాగేశ్వరరావును బ్రతిమాలాను. అయితే, ఆయన ఆమెను శ్రీకాంత్ కి హీరోయిన్ గా పెట్టాడు" అని చెప్పారు. 

'ఘర్షణ' వలన అప్పటికే ఆమెకి చాలా క్రేజ్ రావడం ఈ సినిమాకి హెల్ప్ అయింది. తాను సీనియర్ అయినప్పటికీ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు బాబ్జీ. 'మంత్రిగారి వియ్యంకుడు' సినిమాలో చిరంజీవిగారి పాత్ర పేరు ఇదే. ఆయనపై గల అభిమానంతో అడిగిమరీ ఆ పాత్ర పేరు పెట్టించాను. ఇక సూర్యకాంతం గారు ఇంగ్లిష్ చాలా బాగా మాట్లాడుతుందనే విషయం కూడా నాకు అప్పుడే అర్థమైంది" అని అన్నారు.

One By Two
JD Chakravarthy
Srikanth
Nirosha
  • Loading...

More Telugu News