Bigg Boss: నేను ఎవరినీ టార్గెట్ చేయలేదు .. ఎవరికీ భయపడలేదు: 'బిగ్ బాస్' శోభ శెట్టి

Sobha Shetty Interview

  • ముగింపు దశకి చేరుకున్న బిగ్ బాస్
  • హౌస్ నుంచి బయటికి వచ్చేసిన శోభ 
  • తనకి శత్రువులు ఎవరూ లేరని వెల్లడి 
  • ప్రియాంక - అమర్ వలన తాను బయటికి రాలేదని వ్యాఖ్య


'బిగ్ బాస్' సీజన్ 7 ముగింపు దశకి చేరుకుంది. మొదటి నుంచి కూడా శోభా శెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. హౌస్ లో 14 వారాలను పూర్తిచేసుకున్న తరువాత ఇంటి నుంచి శోభ శెట్టి బయటికి వచ్చింది. తాజాగా 'మన మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.

"టాప్ 5లో ఉండలేకపోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ హౌస్ లో ఉన్నంత కాలం నా ఆటతీరు విషయంలో సంతృప్తికరంగానే ఉన్నాను. నాకు ఏదైతే అనిపించిందో అది చెప్పాను .. అలాగే చేశాను. మనసులో దాచుకోవడం .. సెల్ఫ్ గేమ్ ఆడటం వంటివి చేయలేదు. ఎవరినీ టార్గెట్ చేయలేదు .. అలాగే ఎవరికీ భయపడలేదు కూడా" అని అంది. 

"హౌస్ లో నాకు శత్రువులు లేరు.  ఫోకస్ నా గేమ్ పై పెట్టాను తప్ప .. సభ్యులపై కాదు. శివాజీ గారిని గౌరవిస్తూనే, ఆయనను మరోలా బయటికి చూపించే ప్రయత్నాలు నేను చేయలేదు. ప్రియాంక - అమర్ గురించి స్టాండ్ తీసుకోవడం వల్లనే నేను బయటికి రావలసి వచ్చిందంటే మాత్రం నేను నమ్మను" అని చెప్పింది. 

Bigg Boss
Sobha Shetty
Priyanka
Amar
  • Loading...

More Telugu News