Roshan Kanakala: ఎన్టీఆర్ కీ .. మా నాన్నకి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు: హీరో రోషన్ కనకాల

Roshan Kanakala Interview

  • 'బబుల్ గమ్'తో హీరోగా రోషన్ ఎంట్రీ
  • ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హీరో  
  • ఎన్టీఆర్ - రాజీవ్ ఫ్రెండ్షిప్ గురించి ప్రస్తావన
  • ఎన్టీఆర్ లా డాన్స్ చేయాలనుందని వ్యాఖ్య  


సుమ - రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన హీరోగా చేసిన 'బబుల్ గమ్' సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "నేను మా తాతగారి దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నాను .. ఆయన చివరి శిష్యుడిని నేనే అని చెప్పుకోవాలి" అన్నాడు. 

"నాన్నకీ .. ఎన్టీఆర్ గారికి మధ్య చాలా కాలం నుంచి మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ గారు ఎంతగా ఎదిగినా, ఆయన ఇప్పటికీ అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఆయనకీ .. నాన్నకి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం లేదు .. ఇద్దరూ ఇప్పటికీ అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు" అని చెప్పాడు. 

"ఇప్పుడున్న ట్రెండులో హీరోగా నిలబడాలంటే డాన్సులు బాగా వచ్చి ఉండాలి. ఎన్టీఆర్ గారు గొప్ప డాన్సర్. ఆయనను చూసి నేర్చుకోమనే మా నాన్నగారు చెబుతూ ఉంటారు. ఎంత కష్టమైన స్టెప్స్ కంపోజ్ చేసినా, ఎన్టీఆర్ గారు అలా చూసి .. ఇలా చేసేస్తారు. నాకు కూడా ఆ రేంజ్ కి చేరుకోవాలనే ఉంది. కాకపోతే అందుకు చాలా సమయం పట్టొచ్చు" అని అన్నాడు.

Roshan Kanakala
Suma
Rajeev kanakala
  • Loading...

More Telugu News