AP Capital: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై విచారణ... ఈ నెల 18కి వాయిదా వేసిన హైకోర్టు

AP High Court adjourns hearing on Rajadhani Parirakshana Samithi petition

  • కార్యాలయాల తరలింపు ముసుగులో రాజధాని తరలిస్తున్నారంటూ పిటిషన్
  • హైకోర్టును ఆశ్రయించిన రాజధాని పరిరక్షణ సమితి
  • పరిరక్షణ సమితి పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు

ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ రాజధాని పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. 

వాదనల సందర్భంగా... ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం ఎదుటకు పంపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కోర్టు రిజిస్ట్రీలో ఆ మేరకు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. 

వాదనలు విన్న పిమ్మట న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబరు 18కి వాయిదా వేసింది. 

ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు నిన్నటి విచారణలో కోరింది. ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పుడే తరలించడంలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కార్యాలయాలు తరలిస్తున్నారన్నది కేవలం అపోహ అని స్పష్టం చేశారు. ఈ మేరకు తమ అఫిడవిట్ సమర్పించారు.

More Telugu News