SriRangam: శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో!

AndhraPradesh Devotiees Attacked by Srirangam Temple Security Personnal

  • తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలింపు
  • క్యూలైన్ లో భద్రతా సిబ్బందికి, భక్తులకు మధ్య వివాదం
  • ఘర్షణ తలెత్తడంతో భద్రతా సిబ్బంది దాడి

తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులకు, ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రం కావడంతో భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ భక్తులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

భద్రతా సిబ్బంది దాడిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ భక్తులు క్యూలైన్ లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వామి వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో.. భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More Telugu News