Mahesh Babu: మహేశ్ బాబు 'గుంటూరు కారం' నుంచి 'ఓ మై బైబీ' సాంగ్ ప్రోమో విడుదల

Oh My Baby song promo from Guntur Kaaram out now

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం
  • శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు
  • వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మై బేబీ అనే పాట ప్రోమో రిలీజైంది. పూర్తి లిరికల్ వీడియోను ఈ నెల 13న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఓ మై బేబీ గీతానికి తమన్ బాణీలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. గాయని శిల్పా రావు ఆలపించారు. గుంటూరు కారం చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

More Telugu News