Prakash Raj: కేసీఆర్ ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లిన నటుడు ప్రకాశ్ రాజ్

Prakash Raj goes to Yashoda Hospital

  • బాత్రూంలో జారిపడిన కేసీఆర్... హిప్ రీప్లేస్ మెంట్ చేసిన వైద్యులు
  • యశోదా ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
  • ఆసుపత్రిలో కేటీఆర్ తో మాట్లాడిన ప్రకాశ్ రాజ్
  • కేసీఆర్ కోలుకుంటున్నారని తెలుసుకుని హర్షం

ఇటీవల బాత్రూంలో జారిపడి హిప్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ ను పలువురు ప్రముఖులు కలిసి పరామర్శిస్తున్నారు. 

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా నేడు సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రకాశ్ రాజ్ కలిశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారన్న విషయం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్ కుమార్తె కవిత, బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మధుసూదనాచారి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు కూడా ఉన్నారు.

Prakash Raj
Yashoda Hospital
KCR
KTR
Hyderabad
BRS
Telangana
  • Loading...

More Telugu News