Sri Lanka: చీకట్లో శ్రీలంక.. దేశ వ్యాప్తంగా ఆగిపోయిన విద్యుత్ సరఫరా

Electricity outage in Sri Lanka

  • సాంకేతిక సమస్యతో ఆగిన విద్యుత్ సరఫరా
  • దారుణంగా ఆసుపత్రుల్లోని రోగుల పరిస్థితి
  • ఏడాది కాలంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను విద్యుత్ సమస్య కూడా వేధిస్తోంది. తాజాగా సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని సిలోన్ ఎలెక్ట్రిసిటీ బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు. కాట్ మలే - బియగమా మధ్య ప్రధాన విద్యుత్ లైనులో సమస్య ఏర్పడటంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. 

గత ఏడాదిగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. దేశంలో విద్యుత్ కోతలు కూడా కామన్ అయిపోయాయి. ప్రతి రోజూ 10 గంటల సేపు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో... ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.

Sri Lanka
Electricity
  • Loading...

More Telugu News