Kuwait: ఫ్యామిలీ వీసా జారీ చేసే దిశగా కువైత్ యోచన

Kuwait mulls family visa

  • ఆర్టికల్ 22 కింద ఫ్యామిలీ వీసా జారీకి కువైత్ యోచన
  • నిబంధనల రూపకల్పనకు త్వరలో కమిటీ ఏర్పాటు
  • కొన్ని వృత్తుల వారికే వీసాను పరిమితం చేసే అవకాశం

ఆర్టికల్ 22 కింద ఫ్యామిలీ వీసాలు జారీ చేసేందుకు కువైత్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ వీసాల జారీ ప్రారంభం కావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇది కొన్ని కేటగిరీల వారికే పరిమితం చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. డాక్టర్లు, యూనివర్సిటీ, కళాశాలల ప్రొఫెసర్లు, కౌన్సెలర్లు, ఇతర వృత్తి నిపుణులకు ఈ వీసా జారీ చేసే అవకాశం ఉంది. ఈ వీసా నిబంధనల రూపకల్పనకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో దేశ జనాభాలో రాబోయే మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ ఏయే వృత్తి నిపుణులకు వీసాలు జారీ చేయాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 

ఇదిలా ఉంటే, వీసా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యల కోసం గల్ఫ్ దేశాల కూటమి జీసీసీ ఉమ్మడి విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా వీసా కాలపరిమితి దాటినా దేశంలో ఉంటున్న వారిపై రోజుకు 100 కువైత్ దినార్ ల జరిమానా విధించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Kuwait
Family Visa
NRI
  • Loading...

More Telugu News