KCR: కేసీఆర్ వాకర్‌తో నడుస్తుండటంపై నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్

Prakash Raj tweet on KCR waling on walker

  • కేసీఆర్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్
  • "మై రాక్ స్టార్" అంటూ కితాబు
  • వాకర్‌తో నడుస్తున్న వీడియోను పంచుకున్న ప్రకాశ్ రాజ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను "మై రాక్ స్టార్" అంటూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం నాడు ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడి, యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైంది. 

ప్రస్తుతం కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

More Telugu News