Mahesh Babu: ఓ మై బేబీ... మహేశ్ బాబు 'గుంటూరు కారం' నుంచి రెండో సింగిల్ కు రంగం సిద్ధం

Second single from Mahesh Babu Guntur Kaaram movie will be out on Dec 13

  • మహేశ్ బాబు హీరోగా గుంటూరు కారం
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం
  • 2024 జనవరి 12న రిలీజ్
  • ఇటీవలే దమ్ మసాలా సాంగ్ విడుదల
  • డిసెంబరు 13న రెండో పాటను రిలీజ్ చేయనున్న చిత్రబృందం

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా, ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న సాయంత్రం 4.05 గంటలకు 'ఓ మై బేబీ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ కానుంది. పూర్తి పాటను డిసెంబరు 13న విడుదల చేయనున్నారు. 

ఇటీవలే 'గుంటూరు కారం' నుంచి తొలి సింగిల్ 'దమ్ మసాలా' లిరికల్ వీడియో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మహేశ్ మాస్ స్టామినాను ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాటకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. 'గుంటూరు కారం' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News