BJP MLAs: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు

BJP MLAs Expelled Assembly Session

  • పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో ఎమ్మెల్యేల భేటీ
  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • అసెంబ్లీ సమావేశాలపై చర్చించిన ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కీలక భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణ స్వీకారం చేయబోమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం, ఒవైసీ ప్రమాణం కూడా చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది శనివారం ఉదయం కిషన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత అందరూ కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీసులో వారంతా సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ గా ఒవైసీ ఎంపిక అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడంపైనా చర్చించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ రేసులో రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

BJP MLAs
Assembly Session
Expelled
Raja singh
Kishan Reddy
  • Loading...

More Telugu News