Revanth Reddy: లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy resigns for Lok Sabha

  • కేబినెట్ బెర్త్‌లు, శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీకి రేవంత్
  • సభాపతి ఓంబిర్లాను కలిసి రాజీనామాను సమర్పించిన రేవంత్ రెడ్డి
  • రాజీనామా సమర్పణ అనంతరం తిరిగి హైదరాబాద్‌కు...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. లోక్ సభ సభాపతి ఓం బిర్లాతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సభాపతితో సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా ఉన్నారు. సభాపతికి రాజీనామాను సమర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో శాఖల కేటాయింపు, మరో ఆరుగురు కేబినెట్ ఎంపికపై చర్చించేందుకు రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు.

Revanth Reddy
Telangana Assembly Results
Lok Sabha Speaker
  • Loading...

More Telugu News