UPSC: యూపీఎస్సీ మెయిన్స్-2023 ఫలితాల విడుదల

UPSC releases Mains 2023 results

  • ఈ ఏడాది సెప్టెంబరులో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు
  • నేడు ఉత్తీర్ణుల జాబితా విడుదల చేసిన యూపీఎస్సీ
  • త్వరలోనే ఇంటర్వ్యూలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేడు యూపీఎస్సీ మెయిన్స్-2023 ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (upsc.gov.in) లో ఫలితాలు చూసుకోవచ్చు. తమ అడ్మిట్ కార్డు నెంబరు ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చూసుకోవడంతో పాటు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి 24 వరకు నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల కోసం దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ (వ్యక్తిత్వ నిర్ధారణ పరీక్ష) నిర్వహిస్తారు. యూపీఎస్సీ త్వరలోనే ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించనుంది.

UPSC
Results
Mains-2023
Civils
India
  • Loading...

More Telugu News