Raja Singh: అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది లేదు!: రాజాసింగ్

Rajasinhg hot comments on taking oath

  • ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ
  • పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే ప్రమాణ స్వీకారం చేస్తానన్న రాజాసింగ్
  • 2018లోనూ మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినప్పుడు ఇదే వైఖరి

ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ స్పష్టం చేశారు. అక్బరుద్దీన్‌ను తెలంగాణ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ మాట్లాడుతూ... అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తాను అంగీకరించేది లేదని, అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. 2018లోనూ రాజాసింగ్... ప్రొటెం స్పీకర్‌‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ వ్యవహరించినప్పుడు ఇలాగే ప్రకటించారు. ఆ తర్వాత అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వచ్చాకే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నారు.

Raja Singh
BJP
Akbaruddin Owaisi
  • Loading...

More Telugu News