Revanth Reddy: సెక్రటేరియట్ కు చేరుకున్న రేవంత్.. కాసేపట్లో విద్యుత్ శాఖపై సమీక్ష

Revanth Reddy reaches secretariat

  • ఉదయం ప్రజాదర్బార్ నిర్వహించిన రేవంత్ రెడ్డి
  • అనంతరం అక్కడి నుంచి నేరుగా సెక్రటేరియట్ కు పయనం
  • విద్యుత్ శాఖపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ కు చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే విద్యుత్ శాఖపై రేవంత్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం భావిస్తున్నారు. కాసేపట్లో విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు రాజీనామాను కూడా ఆమోదించవద్దని... ఈరోజు జరిగే సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని ఆదేశించారు. ఈరోజు జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి నేరుగా సెక్రటేరియట్ కు వచ్చారు.

Revanth Reddy
Congress
Secretariat
  • Loading...

More Telugu News