Praja Darbar: ప్రారంభమైన ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy Praja Darbar started

  • ప్రగతి భవన్ లో కొనసాగుతున్న ప్రజాదర్బార్
  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు
  • కాసేపట్లో సెక్రటేరియట్ కు వెళ్లనున్న రేవంత్

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతిభవన్)లో ప్రారంభమయింది. ప్రభుత్వానికి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి ముఖ్యమంత్రి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని, క్యూలైన్లలో లోపలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

Praja Darbar
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News