K Kavitha: నాన్న త్వరలోనే కోలుకుంటారు: కవిత

Dad will be absolutely fine soon says Kavitha
  • ఫామ్ హౌస్ బాత్రూమ్ లో కాలుజారి పడ్డ కేసీఆర్
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
  • నాన్నకు స్వల్పం గాయం అయిందన్న కవిత
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అర్ధరాత్రి గాయపడిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ... కేసీఆర్ గారికి స్వల్ప గాయం అయిందని... ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలు, ఆకాంక్షలతో నాన్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.
K Kavitha
KCR
BRS
Injury

More Telugu News