KCR: కేసీఆర్‌ కాలికి గాయం.. అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిక!

KCR admitted in Yashoda hospital

  • నిన్న ఫాంహౌస్‌ బాత్రూమ్‌లో కాలు జారిపడ్డ కేసీఆర్
  • అర్ధరాత్రి 2.00 గంటలకు సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలింపు
  • కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైందన్న వైద్యులు
  • ఆసుపత్రికి తరలివెళ్లిన కేటీఆర్, హరీశ్ రావు, కవిత
  • వైద్య పరీక్షల అనంతరం హెల్త్ బులిటెన్ విడుదలకు అవకాశం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అవసరం అవుతుందని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. 

కాగా, విషయం గురించి తెలియగానే కేసీఆర్ కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చర్చించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

KCR
BRS
KTR
Harish Rao
  • Loading...

More Telugu News