Devil: డిఫరెంట్ లుక్స్ తో 'డెవిల్' .. రిలీజ్ డేట్ ఖరారు!

Devil movie release date confirmed

  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'డెవిల్'
  • యాక్షన్ జోనర్లో నడిచే కథ  
  • కథానాయికలుగా సంయుక్త .. మాళవిక నాయర్
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల


కల్యాణ్ రామ్ హీరోగా 'డెవిల్' సినిమా రూపొందింది. అభిషేక్ నామా రూపొందించిన ఈ సినిమా, తాజాగా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. 

పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉప శీర్షిక. కథ ప్రకారం ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఇప్పుడు వదిలిన పోస్టర్ కూడా అదే విషయం చెబుతోంది. ఇది తన కెరియర్ లోనే ప్రత్యేకమైన సినిమా అవుతుందని కల్యాణ్ రామ్ చెబుతున్నాడు. 

మాళవిక నాయర్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

More Telugu News