CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Revanth Reddy Oath Taking ceremony

  • పూలరథంపై సోనియాతో కలిసి వేదిక వద్దకు
  • వేదికపై ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా సీనియర్ నేతలు
  • రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్ 

‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని..’ చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది.

అంతకుముందు, సోనియా గాంధీతో కలిసి పూల వాహనంపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను వేదికపైకి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు రేవంత్ రెడ్డి స్వాగతం పలికి, వేదికపైకి తోడ్కుని వచ్చారు. 


CM Revanth Reddy
Telangana new cm
Oath taking
Congress
Governor
tamilisai
Ministers
  • Loading...

More Telugu News