Ambati Keerthy Naidu: ఒకటి కాదు, రెండు కాదు... ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏపీ యువతి
- వరుసబెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్న కీర్తినాయుడు
- తాజాగా జీఎస్టీ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం
- సివిల్స్ లక్ష్యంగా కృషి చేస్తున్న తెలుగమ్మాయి
ప్రభుత్వ ఉద్యోగం అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ విలువైనదే! ప్రభుత్వ కొలువు సాధిస్తే జీవితంలో స్థిరపడిపోయినట్టేనని నిరుద్యోగులు భావిస్తుంటారు. ఇప్పటి రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం అనుకుంటే, ఓ తెలుగమ్మాయి ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ యువతి పేరు అంబటి కీర్తినాయుడు.
కీర్తినాయుడు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం. ఆమె 2019లో డిగ్రీ పూర్తి చేశారు. సివిల్స్ సాధించాలన్నది ఆమె లక్ష్యం. కీర్తినాయుడు తొలుత 2019లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయ పన్ను విభాగంలో ఉన్నతాధికారి ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత కేంద్ర కస్టమ్స్ డిపార్ట్ మెంట్ లో ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు.
2022లో ఎస్ఎస్ సీ నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ ఉద్యోగంతో పాటు, రైల్వే ఆఫీసర్, పోస్టల్ విజిలెన్స్ అధికారి ఉద్యోగం సాధించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల విభాగంలో జీఎస్టీ ఇన్ స్పెక్టర్ కొలువు సాధించారు. కాగా, కీర్తినాయుడు తండ్రి అంబటి మురళీకృష్ణ ఓ న్యాయవాది.