Mallu Bhatti Vikramarka: తన కార్యాలయంలో వైఎస్ చిత్ర పటానికి పూజలు చేసిన భట్టి విక్రమార్క

Bhatti offers prayers to YSR portrait

  • అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క
  • భట్టికి డిప్యూటీ సీఎం పదవి
  • వైఎస్ చిత్రపటానికి పూల మాల వేసిన భట్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత మల్లు భట్టి విక్రమార్కలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఖాయమైంది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా, పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భట్టి కూడా హాజరవుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నేడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క తన కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

Mallu Bhatti Vikramarka
YSR
Prayers
Congress
Telangana

More Telugu News