Lokesh: ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన వాళ్లతోనే పెట్టిస్తాం: నారా లోకేశ్

TDP National Secretary Nara Lokesh Tweet

  • బాపట్ల మండలం భర్తీపూడిలో విగ్రహం కూల్చివేత
  • ఓటమి భయంతో వైసీపీ నేతల దుర్మార్గం
  • తీవ్రంగా ఖండిస్తున్నామంటూ లోకేశ్ ట్వీట్

వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి భయంతోనే దుర్మార్గాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బాపట్ల మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరూ తొలగించలేరని చెప్పారు. ఆయన విగ్రహాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. విగ్రహాల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని, 3 నెలల్లో కూల్చిన వారితోనే, కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Lokesh
Tweet
NTR Statue
Bapatla
Andhra Pradesh

More Telugu News