NTR 31: ఎన్టీఆర్ 31పై ప్రశాంత్ నీల్ కీలక కామెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ

NTR 31 NTR prashanth neel comments on movie story line

  • ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ కొత్త మూవీ కథపై సర్వత్రా సస్పెన్స్
  • యాక్షన్ మూవీ అయి ఉండొచ్చని అభిమానుల్లో చర్చ
  • మునుపటి తన చిత్రాలకంటే ఎన్టీఆర్ 31 భిన్నమైనదన్న దర్శకుడు ప్రశాంత్ నీల్
  • కథ ఎలాంటిదైనా జనాలకు కనెక్ట్ అవుతుందని వ్యాఖ్య

ఎన్టీఆర్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో తెరకెక్కించబోయే సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా చేసిన అప్‌డేట్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెంచేసింది. సినిమా కథకు నేపథ్యం ఏంటనే విషయంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలన్నిటికీ ఎన్టీఆర్ 31 విభిన్నంగా ఉంటుందన్నారు. అయితే, కథ నేపథ్యం ఏమిటో పూర్తిగా వెల్లడించలేదు. ఇది యాక్షన్ చిత్రమన్న భావన ప్రజల్లో ఉందని, జానర్ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. 

కేజీఎఫ్-3 గురించి కూడా ప్రశాంత్ నీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైందని వెల్లడించారు. కేజీఎఫ్-2కు సీక్వెల్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ సినిమా చివర్లో హింట్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్-1- సీజ్ ఫైర్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సలార్‌ను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.

NTR 31
Junior NTR
Prashanth Neel
Tollywood
  • Loading...

More Telugu News