Prabhas: మాస్ ఆడియన్స్ ను ఊరిస్తున్న సలార్ .. దేవర .. పుష్ప 2

- బొగ్గు గనుల నేపథ్యంలో సాగే 'సలార్'
- సముద్రం నేపథ్యంలో నడిచే 'దేవర'
- అడవి చుట్టూ అల్లుకున్న కథతో 'పుష్ప2'
- పాన్ ఇండియా స్థాయిలో పలకరించనున్న మాస్ యాక్షన్
మాస్ ఆడియన్స్ ను ఊరిస్తున్న పాన్ ఇండియా సినిమాల జాబితాలో ఇప్పుడు 'సలార్' .. 'దేవర' .. 'పుష్ప 2' సినిమాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా 'బొగ్గుగనుల' నేపథ్యంలో కొనసాగుతుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.

ఈ మూడు సినిమాల కథా నేపథ్యం వేరైనప్పటికీ, ఎమోషన్స్ తో కూడిన మాస్ యాక్షన్ తో ముందుకు వెళ్లనున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ తో మంత్ర' ముగ్ధులను చేయనున్నాయి. 'పుష్ప' మాదిరిగానే 'సలార్' .. 'దేవర' రెండో పార్టును కలిగి ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ఐదు భాషల్లో విడుదలవుతుండటం మరో విశేషం.