Jobs: ఎస్ బీఐలో భారీగా కొలువులు

SBI Mega Job Notificaion

  • 5 వేలకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
  • మూడు దశలుగా నియామక ప్రక్రియ
  • ఈ నెల 12 తో ముగియనున్న దరఖాస్తు గడువు

బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఏకంగా 5,447 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 16 సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏదేనీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు ఏదేనీ ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

అర్హతలు..
విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ బ్యాచిలర్ డిగ్రీ
వయసు : 21 నుంచి 30 ఏళ్లు (31-10-2023 నాటికి). నిబంధనల మేరకు రిజర్వ్ డ్ కేటగిరీ వారికి సడలింపు

జీతం : ప్రారంభంలో.. రూ.36,100 - రూ.53.840 

ఎంపిక.. : నియామక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ఆన్ లైన్ టెస్ట్, సర్టిఫికెట్ల స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ లో 12-12-2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. 2024 జనవరిలో ఆన్ లైన్ టెస్ట్ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ టెస్ట్ కేంద్రాలు : గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్

పూర్తి వివరాలు, ఆన్ లైన్ దరఖాస్తులకు సంబంధించిన సమాచారం కోసం https://bank.sbi/web/careers లో చూడొచ్చు.

Jobs
Notification
Bank Jobs
recruitment
SBI Jobs
  • Loading...

More Telugu News