Srikanth: అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నానంటే..!: హీరో శ్రీకాంత్

Srikanth Interview

  • హీరోగా ఒక రేంజ్ కి వెళ్లిన శ్రీకాంత్ 
  • పాతికేళ్లకు పైగా కొనసాగిన కెరియర్ 
  • విలన్ వేషాల గురించిన ప్రస్తావన 
  • ఇప్పుడు బెటర్ గా ఉన్నానని చెప్పిన శ్రీకాంత్


చాలా చిన్న సినిమాలతో శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొనసాగిన ఆయన కెరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. చాలా వేగంగా ఆయన 100 సినిమాలను పూర్తిచేసి కూడా చాలా కాలమే అయింది. ఇక ఈ మధ్య ఆయన కుదిరితే హీరోగా .. లేదంటే కీలకమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. 'అఖండ' సినిమాలో విలన్ గా కూడా మెప్పించాడు. 

రీసెంటుగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ .. "గతంలో నేను చేసిన 'ఆపరేషన్ దుర్యోధన' సినిమాలో నా లుక్ చూసి, బోయపాటి నాకు 'అఖండ' సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. మొదటి నుంచి కూడా .. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చింది" అని అన్నాడు. 

"హీరోగా 25 సంవత్సరాల పాటు చేస్తూ వచ్చాను. ఇప్పుడు నా స్థాయికి తగిన ముఖ్యమైన రోల్స్ చేస్తున్నాను. హీరోగా చేస్తున్నప్పుడు చాలా టెన్షన్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి టెన్షన్స్ లేవు. అప్పటితో పోల్చుకుంటే డబ్బు పరంగా .. టెన్షన్స్ పరంగా ఇప్పుడే బెటర్ గా ఉన్నాను. రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక నేను మరింత హ్యాపీ" అని చెప్పాడు. 

More Telugu News