Revanth Reddy: రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు.. !

Komatireddy Venkata Reddy congratulates Revanth Reddy

  • సీఎల్పీ నేతగా, సీఎంగా ఎంపికైన సోదరుడు రేవంత్‌కి శుభాకాంక్షలు అంటూ వెంకటరెడ్డి ట్వీట్
  • కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్
  • రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం (రేపు) ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సమయంలో రేవంత్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎల్పీ నేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి సోదరుడికి అభినందనలు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ వెంకటరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో ఇద్దరూ ఒకే వేదికపై ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ‘ఎక్స్’ వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Revanth Reddy
Komatireddy Venkat Reddy
Congress
Telangana

More Telugu News