PV Sindhu: నేను ఇంకా సింగిల్: పీవీ సింధు

PV Sindhu opines on relation

  • పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా శ్రమిస్తున్న పీవీ సింధు
  • ఓ యూట్యూబ్ చానల్ పాడ్ కాస్ట్ లో ఆసక్తికర జవాబులు
  • ఇప్పటివరకు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని వెల్లడి  

పీవీ సింధు... అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో భారత కీర్తిపతాకను ఎగురవేసిన యువ క్రీడాకారిణి. ప్రస్తుతం పీవీ సింధు దృష్టంతా పారిస్ ఒలింపిక్స్ పైనే ఉంది. ఒలింపిక్స్ స్వర్ణమే తన లక్ష్యం అంటున్న ఈ తెలుగమ్మాయిని లవ్, రిలేషన్ షిప్ వంటి అంశాలపై ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?

ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు వివిధ అంశాలపై స్పందించింది. తాను ప్రస్తుతం సింగిల్ అంటూ తన స్టేటస్ ను వెల్లడించింది. బ్యాడ్మింటన్ గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించనని, తన గురి అంతా ఒలింపిక్స్ స్వర్ణంపైనే అని స్పష్టం చేసింది. ఇతర సంబంధాల గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని నమ్ముతానని సింధు వెల్లడించింది. ఇంతవరకు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

PV Sindhu
Relationship
Love
Dating
Badminton
  • Loading...

More Telugu News