Revanth Reddy: హోటల్ ఎల్లా వద్ద రేవంత్ అనుచరుల రచ్చ.. పోలీస్ స్టేషన్ కు తరలింపు

Revanth Reddy followers slogans at Ella Hotel
  • హోటల్ ఎల్లాలో రేవంత్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • రేవంత్ సీఎం అంటూ హోటల్ గేటు వద్ద కొందరు యువకుల నినాదాలు
  • ఆత్మహత్యాయత్నం చేసిన కొందరు యువకులు
టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొందరు యువకులు హోటల్ వద్ద రచ్చ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అంటూ వారు నినాదాలు చేశారు. సీఎంను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారంటూ కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు పీసీపీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ... కొత్త సీఎం విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే సీఎంగా అవకాశం ఇవ్వాలని పరిశీలకులకు చెప్పారని తెలిపారు. అయితే, పార్టీలో అంతర్గతంగా చర్చించే విషయాలు చాలా సున్నితమైనవని... అందుకే వాటిని బహిర్గతం చేయలేకపోతున్నామని చెప్పారు.
Revanth Reddy
Congress
Hotel Ella

More Telugu News