Revanth Reddy: ఖర్గే నివాసంలో ముగిసిన భేటీ... రేవంత్ పేరును సూచించిన రాహుల్ గాంధీ?

Rahul Gandhi suggests Revanth Reddy name for CM post

  • ఢిల్లీ చేరిన తెలంగాణ సీఎం వ్యవహారం
  • ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
  • ఈ సాయంత్రం హైదరాబాద్ తిరిగి రానున్న డీకే శివకుమార్
  • సీఎల్పీ భేటీలో సీఎం పేరు ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వ్యవహారం ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, డీకే శివకుమార్ ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎం పేరును ప్రకటించనున్నారు.

Revanth Reddy
Chief Minister
Telangana
Congress
Rahul Gandhi
Mallikarjun Kharge
DK Shivakumar
New Delhi
  • Loading...

More Telugu News