Roja: సీఎం జగన్ చేస్తున్న సహాయక చర్యలు చూసి తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారు: రోజా

Roja slams TDP leaders

  • ఏపీపై మిగ్జామ్ తుపాను ప్రభావం
  • రాజకీయ పక్షాల మధ్య మాటల దాడి
  • టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న మంత్రి రోజా
  • చేతల ప్రభుత్వం గురించి పిచ్చికూతలు కూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టీకరణ

మిగ్జామ్ తుపాను నేపథ్యంలోనూ ఏపీలో రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొగుడు కొట్టినందుకు కాదు... తోడికోడలు దెప్పినందుకు ఏడ్చింది అన్న చందంగా టీడీపీ నాయకుల పరిస్థితి ఉందని మంత్రి రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం జగన్ చేస్తున్న సహాయక చర్యలు చూసి తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, పచ్చ మీడియాలో పిచ్చి కూతలు కూసి, పచ్చి రాతలు రాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వాళ్ల హయాంలో చేసిన సహాయం గురించి మాట్లాడాలని, అలా కాకుండా చేతల ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రోజా స్పష్టం చేశాఉ.

Roja
CM Jagan
TDP Leaders
YSRCP
Michaung
  • Loading...

More Telugu News