Revanth Reddy: ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎంపికపై కీలక భేటీ.... గచ్చిబౌలి హోటల్‌లో రేవంత్ రెడ్డికి అధికారుల శుభాకాంక్షలు

MLAs greets Revanth Reddy

  • ఢిల్లీలో ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఠాక్రేల భేటీ
  • దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా జోరుగా ప్రచారం
  • గచ్చిబౌలి హోటల్లో రేవంత్ రెడ్డికి భద్రత పెంచిన పోలీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా... దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా ప్రచారం సాగుతోంది. 

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల శుభాకాంక్షలు

మరోవైపు, రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు 48 గంటలుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలియడంతో ఆయనకు హోటల్ లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే పలువురు అధికారులు కూడా టీపీసీసీ అధినేతను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్‌లో రేవంత్ రెడ్డి ఉండే గది వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

Revanth Reddy
Telangana Election 2018
Congress
Rahul Gandhi
DK Shivakumar
  • Loading...

More Telugu News