Kapila Theertham: వరద నీటితో ఉప్పొంగుతున్న తిరుపతి కపిలతీర్థం జలపాతం... వీడియో ఇదిగో!

Kapila Theertham waterfall in full flow

  • మిగ్జామ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు
  • శేషాచల అటవీప్రాంతం నుంచి వరద 
  • పరవళ్లు తొక్కుతూ కిందికి దుముకుతున్న జలపాతం
  • వీడియో పంచుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి 

తిరుమల గిరుల చెంత ఉన్న తిరుపతి కపిలతీర్థం జలపాతం వరద నీటితో ఉప్పొంగుతోంది. మిగ్జామ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దుముకుతోంది. ఇక్కడి మాల్వాడి గుండం జలకళ సంతరించుకుంది. కపిలతీర్థం జలపాతం పోటెత్తుతుండడంతో చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలిస్తున్నారు. జలపాతానికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Kapila Theertham
Waterfall
Flood
Rains
Michaung
Tirupati
Tirumala

More Telugu News