Dunki: ఆసక్తినిరేపుతున్న 'డంకి' .. ట్రైలర్ రిలీజ్

Dunki Treiler Released

  • రెండు భారీ హిట్లతో ఉన్న షారుక్ 
  • ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'డంకి'
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా రిలీజ్


ప్రస్తుతం షారుక్ ఖాన్ మంచి జోరుమీదున్నాడు. ఒకానొక దశలో వరుస ఫ్లాపులతో ఆయన సతమతమైపోయాడు. ఆ తరువాత ఆయన చేసిన 'పఠాన్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఇటీవల వచ్చిన 'జవాన్' కూడా దాదాపు అదే స్థాయిలో దూసుకుపోయింది. 

ఈ నేపథ్యంలో షారుక్ నుంచి రావడానికి ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది .. అదే 'డంకి'. షారుక్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాకు, రాజ్ కుమార్ హిర్వాణి దర్శకత్వం వహించాడు. ఈ నెల 21వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. 

కామెడీ ... యాక్షన్ .. ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుందని ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. షారుక్ పాత్రలోని వేరియేషన్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. తాప్సి .. విక్కీ కౌశల్ .. బొమన్ ఇరాని ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రీతం బాణీలను స్వరపరచగా, అమన్ పంత్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు.

Dunki
Shah Rukh Khan
Taapsee Pannu
Vicky Kaushal

More Telugu News