Bigg Boss: నమ్మించి మోసం చేశావ్: అమర్ దీప్ పై మండిపడిన ప్రశాంత్ 

Bigg Boss 7 Update

  • 14 వారాలు పూర్తిచేసుకున్న 'బిగ్ బాస్'
  • చివరిసారిగా జరిగిన నామినేషన్స్ 
  • పతాక స్థాయిలో సభ్యుల మధ్య నడిచిన వాదనలు 
  • అమర్ దీప్ పై మండిపడిన ప్రశాంత్


బిగ్ బాస్ హౌస్ లో 14 వారాలు పూర్తయ్యాయి. 'ఫినాలే అస్త్రా'ను సంపాదించి ఫినాలే వీక్ కి అర్జున్ వెళ్లాడు. ఇక మిగతావారి మధ్య నిన్న చివరి నామినేషన్స్ ప్రక్రియ నడిచింది. నామినేట్ చేసే రీజన్స్ విషయంలో అందరి మధ్య వాదనలు నడిచాయి. ముఖ్యంగా అమర్ దీప్ .. ప్రశాంత్ మధ్య ఆరోపణలు ఒక రేంజ్ కి వెళ్లాయి. 

ప్రశాంత్ ను అమరదీప్ నామినేట్ చేశాడు. ఆ రీజన్ కరెక్టు కాదని ప్రశాంత్ చెబుతున్నా అతను వినిపించుకోలేదు. దాంతో ప్రశాంత్ బరస్ట్ అయ్యాడు. "నీ దగ్గర సరైన పాయింట్ లేకుండా నామినేట్ చేశావ్. ఫస్టు నుంచి కూడా నువ్వు నా విషయంలో నెగెటివ్ గానే ఆలోచన చేస్తూ వచ్చావ్. నేను నిన్ను నమ్మాను .. నువ్వు మైండ్ గేమ్ ఆడుతూ వచ్చావు" అంటూ మండిపడ్డాడు. 

"నువ్వు నువ్వు కాదు ... నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది. నమ్మించి మోసం చేయడం నీ గుణం. నీ వలన నేను మోసపోయాను" అంటూ ప్రశాంత్ ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు. 'నేనేమైనా పిల్లోణ్ణి అనుకుంటున్నావా?' అంటూ అమర్ మరింత సీరియస్ అయ్యాడు. ఇలా వాదన చేస్తూ ఒకరి పైకి ఒకరు వెళ్లారు. దాంతో శివాజీ వచ్చి వాళ్లను విడదీశాడు.

Bigg Boss
Amardeep
Prashanth
Shivaji
  • Loading...

More Telugu News