Eagle: 'ఈగల్' నుంచి హుషారెత్తిస్తున్న మాస్ బీట్!

Eagle movie Update

  • కార్తీక్ ఘట్టమనేని నుంచి 'ఈగల్'
  • డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న రవితేజ
  • హీరోయిన్స్ గా అనుపమ - కావ్య థాపర్ 
  • జనవరి 13వ తేదీన విడుదల 

రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలను వదులుతూ వచ్చాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే మరో సినిమాను థియేటర్స్ కి తీసుకుని రావడానికి ఆయన రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా పేరే 'ఈగల్'.  కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను, పీపుల్ మీడియా వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. 

ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. 'ఆడు మచ్చా' అంటూ ఈ పాట కొనసాగుతోంది. జాతర వాతావరణాన్ని తలపించే సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. రవితేజ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో .. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తున్నాడు. పూర్తి పాటను 5వ తేదీ సాయంత్రం 6:03 నిమిషాలకు విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా అనుపమ పరమేశ్వరన్ - కావ్య థాపర్ అలరించనున్నారు. డేవ్ జాంద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. జనవరి 13న వస్తున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి. 

More Telugu News