Bigg Boss: శివాజీకి మాస్క్ ఉందన్న గౌతమ్ .. అది మానుకోమంటూ శివాజీ అసహనం!

Bigg Boss 7 Update

  • నిన్న ఎలిమినేట్ అయిన గౌతమ్
  • శివాజీ చుట్టూ తిరగొద్దని ప్రశాంత్ కి సలహా
  • అర్జున్ కి .. ప్రియాంకకి మాస్క్ లేదని వెల్లడి
  • గౌతమ్ తీరు గురించి ప్రస్తావించిన శివాజీ


'బిగ్ బాస్'కి సంబంధించిన ఆదివారం నాటి ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగానే సాగింది. నిన్న గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత అతను హౌస్ నుంచి స్టేజ్ పైకి వచ్చాడు. హౌస్ లో ఉన్న సభ్యులలో ఎవరికి మాస్క్ ఉందో ... ఎవరికిలేదో చెప్పమని నాగార్జున అడిగారు. దాంతో అర్జున్ కీ .. ప్రియంకకి మాస్క్ లేదని గౌతమ్ చెప్పాడు. 

ఇక అమర్ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడనీ, శోభకి కూడా కాస్త మాస్క్ ఉన్నట్టే అనిపిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శివాజీ చుట్టూతిరగడం వలన, రావలసిన గుర్తింపు రాకుండా పోతుందనే విషయాన్ని గమనించమని ప్రశాంత్ తో అన్నాడు. ఇక శివాజీకి మాత్రం మాస్క్ ఉన్నట్టే అనిపిస్తుందని చెప్పాడు.

ఆ మాటకి శివాజీ అసహనాన్ని వ్యక్తం చేశాడు. "గౌతమ్ నిన్ను నేను మొదటి నుంచి గమనిస్తూ వస్తున్నాను .. నువ్వు ఓదార్పును కోరుకుంటావు. ముందు భయపడతావు .. ఆ తరువాత సపోర్టు కోసం వెతుక్కుంటావు. అలా ఎప్పుడూ చేయకు .. నీకు నువ్వుగా ఎదగడానికి ప్రయత్నించు. ఇక్కడ ఎవరూ ఏమీ చేయరు" అని అన్నాడు.  

Bigg Boss
Shivaji
Gaitham Krishna
Prashanth
Arjun
  • Loading...

More Telugu News