Daggubati Rambabu: ఎల్లుండి దగ్గుబాటి అభిరామ్ పెళ్లి..పెళ్లికూతురు ఎవరంటే..?

Actor Daggubati Abhiram marriage

  • దగ్గర బంధువు ప్రత్యూషతో అభిరామ్ పెళ్లి
  • శ్రీలంకలోని ఓ స్టార్ హోటల్ లో వివాహ వేడుక
  • పెళ్లికి 200 మంది వరకు అతిథులు హాజరయ్యే అవకాశం

దగ్గుబాటి వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరగబోతోంది. పెళ్లికూతురు కూడా దగ్గర బంధువే కావడం గమనార్హం. తన చినతాత కూతురు కూతురే పెళ్లికూతురు. వధువు పేరు ప్రత్యూష. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం గమనార్హం. శ్రీలంకలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు వివాహ వేడుక జరగనుంది. 

ఈ పెళ్లికి దాదాపు 200కు పైగా అతిథులు హాజరుకానున్నట్టు సమాచారం. ఈ రాత్రి గ్రాండ్ డిన్నర్ తో వివాహ వేడుక ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు మెహందీ వేడుక ఉంటుంది. సినిమాల విషయానికి వస్తే... హీరోగా ఆయన తొలి సినిమా 'అహింస' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Daggubati Rambabu
Tollywood
Marriage
  • Loading...

More Telugu News