Bigg Boss: శివాజీకి ఫస్టులో భయపడ్డాను .. ఆ తరువాత రియలైజ్ అయ్యాను: 'బిగ్ బాస్' గౌతమ్ కృష్ణ

Gautham Krishana Interview

  • 'బిగ్ బాస్ హౌస్' నుంచి వచ్చేసిన గౌతమ్ కృష్ణ
  • అక్కడ తాను నటించలేదని వ్యాఖ్య
  • తనకి కనెక్ట్ అయినవారితో బాగానే ఉన్నానని వివరణ 
  • అందుకే శివాజీని ప్రశ్నించానని వెల్లడి  

'బిగ్ బాస్' హౌస్ నుంచి ఈ వారం గౌతమ్ కృష్ణ బయటికి వచ్చాడు. హౌస్ లో ఆయన ఎక్కువగా శివాజీని నామినేట్ చేస్తూ వచ్చాడు. శివాజీ కొందరితో ఒకలా .. మరికొందరితో మరొకలా ఉంటున్నాడని వాదిస్తూ వచ్చాడు. హౌస్ నుంచి వస్తూ కూడా అదే పాయింట్ ను చెప్పాడు. దాంతో శివాజీ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు కూడా. 

తాజాగా 'మన మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ .. ''బిగ్ బాస్ హౌస్ లో నేను నటించలేదు. సందర్భాన్నిబట్టి నా ఫీలింగ్స్ చూపించాను. తొందరపాటుతో మాట్లాడానని అనిపించినప్పుడు 'సారీ' చెప్పాను. నాకు కరెక్టు అనిపించినవారితో రిలేషన్ కంటిన్యూ చేశాను" అని అన్నాడు. 

"శివాజీగారి విషయంలో ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కదా అని నేను మొదట్లో భయపడ్డాను. అందువల్లనే కొన్ని వారాల పాటు నేను ఆయనను ప్రశ్నించలేదు. ఇక్కడ ఎవరూ మనలను సపోర్టు చేయరు .. ఎవరూ మన గురించి స్టాండ్ తీసుకోరు. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. పక్కనున్న వాళ్ల ఫీలింగ్స్ ను ఎవరూ పట్టించుకోరనే సంగతి నాకు అర్థమైంది. దాంతో నేను శివాజీని ప్రశ్నించడం మొదలుపెట్టాను" అని చెప్పాడు.

Bigg Boss
Gautham Krishna
Shivaji
Priyanka
  • Loading...

More Telugu News