Bigg Boss: 50 లక్షలు గెలుచుకుంటే ఎవరికిస్తానంటే .. 'బిగ్ బాస్' పల్లవి ప్రశాంత్!

Bigg Boss 7 Update

  • చివరిదశకి చేరుకుంటున్న 'బిగ్ బాస్'
  • తగ్గుతూ వస్తున్న సభ్యుల సంఖ్య
  • ప్రైజ్ మనీపై సభ్యుల మనసులో మాట 
  • రైతులకి అండగా నిలుస్తానన్న పల్లవి ప్రశాంత్


బిగ్ బాస్ సీజన్ 7 చివరిదశకి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్స్ దిశగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేయాలనుకుంటున్నారనే ప్రశ్న నిన్న వారికి ఎదురైంది. అందుకు ఎవరికి వారు, తమ మనసులోని మాటను చెబుతూ వెళ్లారు.

అమర్ దీప్ .. శోభ .. ప్రియాంక సొంత ఇంటికోసం ఆ డబ్బును ఉపయోగించుకుంటామని చెప్పారు. తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను గురించి వివరించారు. కొంత తన ఫ్యామిలీ కోసం .. మరికొంత ఛారిటీ కోసం వాడతానని అర్జున్ అన్నాడు. తాను గెలుచుకుంటే .. అప్పుడు చెబుతానని శివాజీ సమాధానమిచ్చాడు. 

పల్లవి ప్రశాంత్ మాత్రం .. తనకి ఆ డబ్బు వస్తే, పంట నష్టాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు సాయంగా నిలబడతానని అన్నాడు. తనకి రైతుల కష్టాలు తెలుసనీ, నష్టపోయిన రైతుల కోసమే ప్రతి రూపాయినీ కేటాయిస్తానంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక వీరిలో విజేతగా ఎవరు నిలుస్తారనేది తేలడానికి ఇంకా సమయం ఉంది. 

Bigg Boss
Prashanth
Shivaji
Priyanka
Amardeep
  • Loading...

More Telugu News