BRS Ministers: గెలిచిన మంత్రులు.. ఓడిన మంత్రులు వీరే!

Winners and loosers of BRS ministers

  • తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ 
  • ఒక స్థానంలో ఓడిపోయిన సీఎం కేసీఆర్
  • ఎర్రబెల్లి, పువ్వాడ, శ్రీనివాస్ గౌడ్ తదితరుల ఓటమి

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన, ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు గుడ్ బై చెప్పారు. కేసీఆర్ పాలనకు ముగింపు పలికారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి స్థానంలో ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన ఎంతో మంది బలమైన నేతలు ఓటమిపాలయ్యారు. పలువురు మంత్రులు కూడా ఓటమిపాలవడం గమనార్హం. 

ఓటమిపాలైన మంత్రులు: ఎర్రబెల్లి దయాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్

గెలిచిన మంత్రులు: కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్

BRS Ministers
Winners
Loosers
Assembly Elections
  • Loading...

More Telugu News